గత ప్రభుత్వం రెండుపడకల గదుల ఇళ్లు ఇస్తామని పదేళ్ల పాటు మభ్య పెట్టిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. ములుగు(D) ఇంచర్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సీతక్క మాట్లాడారు. తమ ప్రభుత్వం ఒకేసారి 4.50 లక్షల మందికి ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఐదేళ్లలో పేదలకు 20 లక్షల ఇళ్లు ఇవ్వడం ఖాయమని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని అన్నారు.