ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమిత్ షా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వెంటనే హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.