ములుగు మండలంలోని కొట్యాల గ్రామ శివారులో ఉన్న చెరువులో ఓ గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన ములుగు కొట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎవరో గుర్తు తెలియని మగ మృతదేహం చెరువులో పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలపడంతో ములుగు ఎస్సై విజయ్ కుమార్ పోలీసులతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తు పట్టిన ములుగు మండల పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగలరని కోరారు.