ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో పల్లవేని రవి తన ఎడ్ల బండితో వెళ్తుండగా బూచికుంట దగ్గర్లో శనివారం ఉదయం తన 2 ఎడ్లకు విద్యుత్ తీగలు తాకి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. తాను ప్రాణంగా పెంచుకున్న ఎడ్లు మృతి చెందడంతో పల్లవేని రవి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ విషయమై అధికారులు స్పందించి అక్కడ ఉన్న తీగలను వెంటనే వేరే వైపుకు మార్చాలని అక్కడున్న గ్రామస్తులు కోరుతున్నారు.