ములుగు: పౌరహక్కుల సంఘం నేతల దిష్టిబొమ్మ దగ్దం

52చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారంలో పౌర హక్కుల సంఘం నేతలకు వ్యతిరేకంగా ఆదివారం గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు. చల్పాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పట్ల వివరాలు తెలుసుకునేందుకు పౌర హక్కుల నేతలు వెళ్తున్నారన్న సమాచారంతో ఏటూరునాగారంలో ఆందోళన చేపట్టారు. అనంతరం పౌర హక్కుల సంఘం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వాజేడు మండలంలో ఇన్ఫార్మర్ల నెపంతో రమేశ్, అర్జున్ లను మావోలు హతమార్చగా వారిపై కనీసం సానుభూతి తెలపలేదని ఆగ్రహించారు.

సంబంధిత పోస్ట్