ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ భూటకమని సోమవారం పౌరహక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. ఏటూరునాగారంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 1న ఎన్కౌంటర్ జరగలేదని, 2 రోజుల ముందే వారిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారన్నారు. అన్నంలో విషం కలిపి, అతి దగ్గర నుంచి కాల్చి చంపారని తెలిపారు. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి మృతదేహాలను తీసుకెళ్తుండగా అప్పటికే దుర్వాసన వస్తుందన్నారు.