ములుగు: ఇళ్ల స్థలాలు పంచి కట్టించాలి: సీపీఎమ్

84చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ లో ఇళ్లు లేని వారికి స్థలాలను కేటాయించి ఇళ్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని సీపీఎమ్ మండల కార్యదర్శి చిరంజీవి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 2023లో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఇప్పటివరకు కేటాయించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. అధికారులు స్పందించి పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించాలని, లేకుంటే జనవరిలో ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకుంటామని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్