ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన నాగేశ్వరరావు ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో గత నెల 23న గ్రామ సభలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబకులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా నాగేశ్వరరావు చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో విషాదం నెలకొంది.