రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రాజస్థాన్ పర్యటన కు వెళ్లనున్నారు. ఉదయపూర్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చింతన్ శివార్లో సీతక్క పాల్గొననున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, అంగన్వాడి పోషన్ 2. 0 పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలు వివరించనున్నారు. కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపైనా మాట్లాడే అవకాశం ఉంది.