రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డి ఎల్ ఆర్ గార్డెన్ లో ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర్ టి. ఎస్, అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావు లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి విజయోత్సవ కార్యక్రమాల ను ప్రారంభించారు.