యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి బుధవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు వస్త్ర ధారణలో రామప్ప ఆలయం చేరుకున్న మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్స్ కు గిరిజన సంప్రదాయం, డోలు వాయిద్యాలతో కొమ్ముకొయ నృత్యంతో ఆదివాసీ కళాకారులు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్స్ కి జిల్లా కలెక్టర్ దీవాకర, టూరిజం శాఖ అధికారులు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు.