ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని స్పెయిన్ దేశస్తుడు జ్వాన్ గురువారం సందర్శించారు. అక్కడే విధుల్లో ఉన్న టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ ఆలయ విశిష్టత, శిల్పకళా వైభవాన్ని అతడికి క్లుప్తంగా వివరించారు. రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని, కళాఖండాలు ఎంతగానో తనను ఆకట్టుకున్నాయని జ్వాన్ కితాబిచ్చారు.