ములుగు జిల్లా లోని రామప్ప దేవాలయాన్ని బుధవారం ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు. 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సుందరీమణులు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ములుగులోని హరిత హోటల్ కు చేరుకుంటారు. 4: 30 కి సాంప్రదాయ వస్త్రాల్లో రామప్ప దేవాలయ దర్శనం చేసుకుంటారు అనంతరం 5: 00 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. రామప్ప దేవాలయ సందర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లుఅధికారులు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.