ములుగు జిల్లా తాడ్వాయి-పస్రా మధ్య అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 'బ్లాక్ బెర్రీ' ఐలాండ్ పర్యాటకులను కనువిందు చేయనుంది. ఆధునిక గూడారాలు, ఫైర్ క్యాంపు, రెస్టారెంట్, ఇసుక తిన్నెలపై పర్యాటకులు ఆడుకునేందుకు ఏకో టూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాగా సోమవారం రాత్రి 'బ్లాక్ బెర్రీ' ఐలాండ్ ను మంత్రి సీతక్క పరిశీలించారు. త్వరలోనే మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు ఐలాండ్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.