1 జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకొని, ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ సమాజంలో గుర్తింపు పొందుతారని తెలిపారు.