క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. శనివారం ములుగు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని అంగన్వాడి టీచర్లు, ఆయాలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కారు అంగన్వాడిల కోసం ఎన్నో చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు.