ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని శనివారం ములుగు జిల్లా ఎస్పీ శబరిశ్ అన్నారు. రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వరదలు ముంచేత్తే సమయంలో ప్రజలకు ఏ విధంగా సహాయ పడాలనే అంశంపై రామప్ప చెరువులో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.