నిజామాబాద్: సంచార జాతి కుటుంబంపై దాడి.. ఖండించిన రాజ్ కుమార్

65చూసినవారు
నిజామాబాద్: సంచార జాతి కుటుంబంపై దాడి.. ఖండించిన రాజ్ కుమార్
నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం నల్లవెల్లిలో వీడీసీ పేరుతో కొంతమంది సంచార జాతి కులాల్లో ఓ కులమైన ఓడ్ కులానికి చెందిన కుటుంబంపై దాడి చేసి వారి ఇంటిని ట్రాక్టర్ తో కూల్చివేశారు. దానిని ఖండించి వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని సంచార జాతుల కులాల ములుగు జిల్లా అధ్యక్షుడు బాణాల రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ సంచార జాతుల వారిపై దాడులు జరుగకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్