అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి

63చూసినవారు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి
ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ శబరీష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మేడారంలో చేపట్టే పనులు దీర్ఘకాలంగా ఉండేవిధంగా పనులు చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్