అధికారులు అప్రమత్తంగా ఉండాలి

53చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రానున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కన్నాయిగూడెం మండల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు అలర్ట్ గా ఉండాలని ఎంపీడీఓ అనిత అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలకేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ‌ లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్