What: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.