స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేత

73చూసినవారు
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేత
ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ, సుభాష్ నగర్ కాలనీ, బెస్తవాడ, సఫాయి వాడ ప్రజల సౌకర్యార్థం స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కు స్థానికులు మంగళవారం వినతిపత్రం అందించారు. గత కొన్నేళ్లుగా సరైన స్థలం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. స్పందించిన కలెక్టర్ స్థల కేటాయింపుకు ఆలోచిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్