ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉ. 9 గంటల నుండి 10: 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ములుగు, మల్లంపల్లి, రామచంద్రపూర్, పస్రా, తాడ్వాయి, మేడారం, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, కమలాపూర్, మంగపేట, మల్లూరు, నూగురు వెంకటాపురం, అలుబాక విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు అసౌకర్యానికి సహకరించాలన్నారు.