ఏటూరునాగారంలో మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

75చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని 12 జీపీల మాజీ సర్పంచులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, సిసి రోడ్లు, డంపింగ్ యార్డు నిర్మించి అప్పుల పాలయ్యమన్నారు. నేటి వరకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కార్యాలయాల ముట్టడికి వెళ్తుండగా అరెస్టు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్