ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఐటిడిఏ కార్యాలయం భవనంపైకి ఎక్కి ఆదివాసులు నిరసన తెలిపారు. ఐటిడిఏ కార్యాలయంలో డిడిగా పనిచేస్తున్న పోచం గిరిజనులకు చెందాల్సిన ఉద్యోగాలలో అవకతవకలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డిడి పోచంను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరపాలని ఐటిడిఏ పిఓ చిత్రమిశ్రాను, అధికారులను బాధిత ఆదివాసులు కోరారు.