క్వారీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్

74చూసినవారు
క్వారీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్
ఇసుక క్వారీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. మంగపేట మండలంలో నిర్వహిస్తున్న పలు ఇసుక క్వారీలను మంగళవారం అకస్మిక తనిఖీలు చేశారు. పొదుమూరు, చుంచు పల్లి, రాజుపేట, కత్తిగూడెంలోని పట్టా, సొసైటీ క్వారీలు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ బైరి వీరాస్వామి, టిఎస్ఎండిసి, పిఓ తారక్ నాథ్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్