ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద 33 కేవీ విద్యుత్ లైన్ పై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లపై చెట్లు కూలి పలు ఇల్లు సైతం ధ్వంసమయ్యాయి.