గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శుక్రవారం అధికార యంత్రాంగం, వివిధ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ములుగు జిల్లా పరిధిలో 10 మండలాలు ఉండగా 10 జడ్పీటీసీ స్థానాలు, 10 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 174 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా కొన్ని మండలాల్లో నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది.