సమ్మక్క బ్యారేజీకి పెరుగుతున్న గోదావరి వరద

52చూసినవారు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి 21, 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందని ఆదివారం ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 32 గేట్లను ఎత్తి 20700 క్యూసెక్కుల నీటిని దిగివకు వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్