పారిపోయిన బాలికను వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించిన ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగింది. ఎస్సై తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం మంగపేటకు చెందిన సురేశ్, లక్ష్మి దంపతులు కూలీ పనుల నిమిత్తం ఏటూరునాగారం వచ్చి, సాయంత్రం మద్యం మత్తులో గొడవ పడ్డారు. తల్లిదండ్రుల గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్లిన బాలికను తల్లిదండ్రులు కొట్టగా భయంతో పారిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా బాలికను గుర్తించారు.