మేడారంలో ఘనంగా సీత్లాభవాని (దాటుడు) పండగ

70చూసినవారు
మేడారంలో ఘనంగా సీత్లాభవాని (దాటుడు) పండగ
సంస్కృతి సాంప్రదాయాలకనుగుణంగా ములుగు జిల్లాలోని ఆయా గ్రామాల లంబాడ, గిరిజనులు బుధవారం సీత్లభవాని (దాటుడు) పండుగను ఘనంగా జరుపుకున్నారు. మేడారంలో సుమారు 50 కుటుంబాల సభ్యులు సీత్లాభవానికి ఆచారం ప్రకారం నైవేద్యం సమర్పించారు. డప్పుచప్పుల మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్నతో పాటు స్థానిక కులపెద్దలు పాల్గొన్నారు