రాంనగర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

82చూసినవారు
రాంనగర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్ పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే టీచర్లుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధనలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంఈఓ మల్లయ్య బహుమతులు అందజేశారు. ఎంఈఓ మాట్లాడుతూ మంచి భవిష్యత్ అందించడానికి టీచర్లు పడే శ్రమను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రవీణ్, టీచర్లు రాజు, వీరభద్రం, విజయ్, లావణ్య, సుజాత ఉన్నారు.

సంబంధిత పోస్ట్