ములుగులో సమగ్ర శిక్షా ఉద్యోగుల అర్ధ నగ్న ప్రదర్శన

72చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు 12 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెగ్యులర్ చేయాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్