ఏటూరునాగారం ఐటిడిఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

51చూసినవారు
ఏటూరునాగారం ఐటిడిఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ములుగు జిల్లా ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలను ఆపద సమయంలో ఆదుకునేందుకు ఐటిడిఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంగళవారం పీఓ చిత్రమిశ్రా తెలిపారు. ముంపు బాధితులు 63098 42395 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుందన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని పీఓ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్