ములుగు జిల్లా తాడ్వాయి మేడారం మినీ జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరగనుంది. మినీ మేడారం జాతర సమీపిస్తుండడంతో సమ్మక్క- సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి భక్తులు ముందుగానే భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు మేకలు, గొర్రెలు, కోళ్లను కోసి మొక్కులు తీర్చుకుంటారు. బుధవారం మేడారంలో ఉండే గొర్రెలను భక్తులకు రూ. 6 వేల రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు.