ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మినీ జాతరకు ఇంకా 7 రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడారం జాతరతో పాటు ఐలాపురం, కొండాయి గ్రామాల్లో సైతం జాతరలు వైభవంగా జరగనున్నాయి. జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు గుడిమెలిగే పూజలతో జాతర మొదలు కానుంది. ఈ నెల 12 నుంచి మినీ జాతరకు ఆర్టీసీ సైతం బస్సులు నడపనుంది.