ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం నుండి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.