ములుగు జిల్లా పస్రా - తాడ్వాయి మధ్య బ్లాక్ బెర్రీ ఐలాండ్ ని సోమవారం రాత్రి మంత్రి సీతక్క సందర్శించారు. రంగు రంగుల విద్యుత్ కాంతుల నడుమ విరజిల్లుతున్న బ్లాక్ బెర్రి ఐలాండ్ అందాలు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా గుడారాలు, హట్స్ ఏర్పాటు చేశారు. పర్యాటకుల సందర్శనార్ధం త్వరలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.