ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాల వద్ద స్నానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరేసారే, బంగారం (బెల్లం) కొబ్బరికాయల సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.