ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఐదు బొలెరో గూడ్స్ వాహనాలు సీజ్ చేశారు. అందులోని
69 పశువులను సురక్షితంగా గోశాలకు తరలించి 10 మంది పైన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మూగ జీవాలను కబేలా కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.