ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో సమ్మక్క-సారలమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి జాతర కార్యక్రమాన్ని ఆలయ పూజారులు ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. రాత్రి నిష్టతో జాగారం నిర్వహించారు. కాగా, ఈ నెల 12 నుంచి 16 వరకు జరగనున్న జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. భక్తులకు కావలసిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.