ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనానికి బుధవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. మినీ మేడారం జాతర ఇంకా ఏడు రోజుల సమయం ఉండడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో సమ్మక్క- సారలమ్మ గద్దెలు భక్తులతో నిండిపోయాయి. జంపన్న వాగు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.