తన చావుకు కారణం ఎస్సై.. సెల్ఫీ వీడియో వైరల్

72చూసినవారు
తన చావుకు కారణం ఎస్సై అంటూ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నాగరాజు పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత కొన్ని రోజులుగా తనను ఎస్సై వేధిస్తున్నాడంటూ, తన వేధింపులు భరించలేక నేను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కాగా నాగరాజు ఇంటి నుంచి వెళ్లినప్పటి నుండి ఇప్పటివరకు ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్