హత్య కేసులో ముగ్గురికి రిమాండ్: సిఐ

63చూసినవారు
హత్య కేసులో ముగ్గురికి రిమాండ్: సిఐ
హత్యకేసులో ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించినట్లు శుక్రవారం ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. శివాలయం వీధికి చెందిన రాములును ఈనెల 4న సారమ్మ, సరిత, శివ అనే ముగ్గురు తన భూమి కాజేయాలని కర్రలతో తీవ్రంగా గాయపరిచరన్నారు. చికిత్స పొందుతూ రాములు ఈనెల 10న మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా రాములు రెండవ అన్న కూతురు సోమలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ కు తరలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్