రామప్ప ఆలయాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్లు

80చూసినవారు
ములుగు జిల్లా లోని రామప్ప ఆలయం కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని 2024 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ లు అన్నారు. మంగళవారం వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఐదుగురు ఐఏఎస్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ సూర్య కిరణ్ ఆలయ విశిష్ఠత గురించి వారికి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్