ములుగు సమీపంలో ట్రాలీ ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

70చూసినవారు
ములుగు సమీపంలో శుక్రవారం ఉదయం కూరగాయల లోడుతో వెళ్తున్న ఓ ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం ధర్మరావుపల్లి నుండి కూరగాయలు విక్రయించేందుకు రైతులు భూపాలపల్లి మార్కెట్ కు వెళ్తుండగా ట్రాలీ ఆటో టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్