నేతకానీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని రాష్ట్ర నేతకాని రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు కావేరి చిన్ని కృష్ణ పిలుపునిచ్చారు. వాజేడు మండలం పూసూరు గ్రామంలో నేతకానులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. చిన్నికృష్ణ మాట్లాడుతూ.. నేతకానులు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతకానులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.