వెంకటాపురం సీడీపీఓ ఆరోగ్యం క్షేమం: వైద్యులు

85చూసినవారు
వెంకటాపురం సీడీపీఓ ఆరోగ్యం క్షేమం: వైద్యులు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నూగూరు వెంకటాపురం సీడీపీఓ ధనలక్ష్మి క్షేమంగా కోలుకుంటున్నట్లు మంగళవారం పీహెచ్సీ వైద్యులు తెలిపారు. చేతి మణికట్టు దగ్గర అయిన గాయాలు చర్మం, ఉపచర్మం స్థాయికి పరిమితమని వైద్యులు నిర్ధారించారు. నరాలు, ధమనులు, కండరాలకు ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. ప్రస్తుతం ధనలక్ష్మి ఆరోగ్యంగా ఉందని వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్