ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. మేడారం గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ మొక్కలకు నీరు పోసేందుకు తీసుకు వెళ్తుండగా తాడ్వాయి - మేడారంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గజ్జల ఆశయ్య అనే వ్యక్తికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.