వివాహం కాలేదన్న బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిరుత అనిల్(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి కాలేదన్న బాధతో మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.